హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 7న డీజేఎఫ్ రాష్ట్ర మహాసభలు

SRD: దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) 11వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణకు ప్రతినిధులు అందజేశారు. ఆదివారం ఆయన నివాసంలో కలసి అక్టోబర్ 7న సంగారెడ్డిలో జరిగే సభకు ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే డీజేఎఫ్ సేవలను కొనియాడారు. విద్యతోనే దళిత వర్గాల సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.