హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

నారాయణపేట జిల్లాలో గణేష్ పండుగ, తాషీ బాబా దర్గా ఉర్సు వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, కించపరిచేలా పోస్టులు లేదా మార్ఫింగ్ చిత్రాలు ఫార్వర్డ్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.