హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహాయక ఉపకరణాల శిబిరం

KNR: హుజురాబాద్ బాయ్స్ హైస్కూల్లో సెప్టెంబర్ 22న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత సహాయక ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. సమగ్ర శిక్ష కరీంనగర్ ఆధ్వర్యంలో శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. 0 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు అర్హులని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.