హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దక్షిణ అమెరికా టోర్నీకి సిక్కోలు అమ్మాయి

SKLM: దక్షిణ అమెరికాలో అక్టోబరు 2 నుంచి 18 వరకు జరగనున్న అంతర్జాతీయ ఇన్‌లైన్ హాకీ టోర్నీకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళ్ల వర్షిత ఎంపికైంది. మెళియాపుట్టి గ్రామానికి చెందిన కాళ్ల ప్రసాద్, సంతోషి దంపతుల కుమార్తె వర్షిత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. చండీగఢ్‌లో గత నెల 30-31న జరిగిన రూరల్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపికల్లో ప్రతిభ కనబరిచింది.