NZB: సిరికొండ (M)లోని ఎల్లమ్మ చెరువులో దూకి పారిపల్లి సాయికుమార్ (32) మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం సాయికుమార్ చెరువులో దూకినట్లు సిరికొండ ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామస్థులు వెంటనే చెరువులోకి దిగి సాయికుమార్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఎల్లమ్మ చెరువులో దూకి వ్యక్తి మృతి


