హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో డ్రైవర్‌పై దాడి.. చికిత్స పొందుతూ మృతి

HYD: ఫలక్‌నుమాలో ఆటో డ్రైవర్ ముక్రం దారుణ హత్యకు గురయ్యాడు. ఓ యూట్యూబర్ అనుచరులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ముక్రం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.