హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే ప్రయాణికులకు పోగొట్టుకున్న సామాను అప్పగింత

HYD: ప్రయాణికులు పోగొట్టుకున్న, వదిలివేసిన వస్తువులను భద్రపరచి, తిరిగి ఇచ్చేందుకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని సికింద్రాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ డీఎస్పీ అలకుంట్ల నవీన్ కుమార్ అన్నారు. 219 కేసులలో మొబైల్స్, బంగారం, ల్యాప్‌టాప్‌లతో సహా మరచిపోయిన రూ.1.181 కోట్ల విలువైన సామాన్లను ఆపరేషన్ అమానత్ ద్వారా ప్రయాణికులకు అప్పగించినట్లు తెలిపారు.