BPT: వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి NH-167Aపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కారంచేడు పరిధిలో ఆగి ఉన్న లారీని బోడవాడ గ్రామానికి చెందిన ఇద్దరు బైక్‌పై వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గణేశుడి నిమజ్జనానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి


