హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతలో సైబర్ నేరాల నివారణపై అవగాహన

ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం వారపు సంతను ఆదివారం సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్‌వర్మ సందర్శించారు. సంతకు వచ్చిన గిరిజనులకు సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. స్మార్ట్‌ ఫోన్లు ఉన్నవారు గుర్తు తెలియని లింకులు, మెసేజ్‌లపై క్లిక్‌ చేయవద్దన్నారు. ఆన్‌లైన్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.