హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటి గరిక పూజలో ఎమ్మెల్యే సుందరపు

AKP: లోకకళ్యాణం, దేశ సుభిక్షం కోసం కోటి గరిక పూజలు నిర్వహించడం విశేషమని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. ఎలమంచిలి పెద్దపల్లి గ్రామంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం నిర్వహించిన పూజలో ఆయన పాల్గొన్నారు . ఆలయ కమిటీ మంగళవాయిద్యాలు, పూర్ణకలశంతో స్వాగతం పలికింది. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.