TPT: సూళ్లూరుపేట మండలం కాలంగి నదిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి ఆచూకీ, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలంగి నదిలో డెడ్ బాడీ లభ్యం


