హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ విమర్శలు

KMM: ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్ల తొలగింపు అంశంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. అధికారుల సమన్వయ లోపంతో ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బాధితులతో సమావేశమైన ఆయన, పేదల ఇళ్లకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమస్యపై బీఆర్ఎస్ తరఫున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.