MBNR: జడ్చర్ల పట్టణంలోని పలు వినాయక మండపాలను మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'వినాయక మండపాలను సందర్శించిన లక్ష్మారెడ్డి'


