హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యం దక్కాలి'

RR: ఉమ్మడి కొత్తూర్ మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బహుజనుల హక్కులు, సామాజిక న్యాయంపై అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. జిల్లా అధ్యక్షుడు జంగా రజినీకాంత్ యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో, రాజ్యాంగ హక్కుల సాధనకు వెనుకబడిన వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యం దక్కాలని ఆకాంక్షించారు.