హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కుల నిర్మూలన సీపీఎంతోనే సాధ్యం'

GDWL: ​దేశంలో సంపద వికేంద్రీకరణ, కుల, సామాజిక అసమానతల నిర్మూలన సీపీఎంతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బి. ప్రసాద్ స్పష్టం చేశారు. గద్వాలలో ఆదివారం జరిగిన రెండో రోజు రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే పార్టీల విధానాలను తిప్పికొడుతూ, కార్మికులు, పేదల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.