హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి యువకుడు మృతి

MNCL: పెళ్లి కావడం లేదని పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన జన్నారం మండలంలోని కలమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన మర్సకోల అంజి (26) పెళ్లి కావడం లేదని బాధతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. పెళ్లి కాకపోవడం, మద్యాన్ని మానలేక విరక్తితో 19న పురుగుల మందు తాగగా, వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.