GNTR: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం బస్టాండ్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రత్తిపాడు నుంచి గుంటూరు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒకరికి కాలు విరగగా, మరొకరికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడులో ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు


