ASR: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండలో ఆదివారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు. ఇందులో భాగంగా రికార్డులు సక్రమంగా లేని రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 24 గంటల్లోగా రెండు వాహనాలకు సంబంధించిన రికార్డులను చూపించి, వాహనాలు తీసుకుని వెళ్లాలని వాహన యజమానులకు సూచించారు. లేకుంటే కేసు నమోదు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల తనిఖీల్లో వాహనాలు స్వాధీనం


