AKP: యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖపట్నం బైక్ పై వెళ్తున్న దంతేశ్వర్ (36) లారీని ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


