హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న వర్షానికే నీటమునిగే ఏఎస్‌ఆర్‌ కాలనీ

BDK: అశ్వారావుపేట ఏఎస్‌ఆర్‌ కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలం చిన్నపాటి వర్షానికే నీటితో నిండిపోతోంది. నీరు వెళ్లేందుకు మార్గం లేక రోజుల తరబడి నిల్వ ఉండటంతో దుర్గంధం, దోమల బెడద పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.