హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు

AKP: కోటవురట్ల మండలం చినబొడ్డేపల్లి గ్రామ పరిధిలో రెడ్డి కొత్తూరు కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు అక్కడికి వెళ్లి ట్రాక్టర్, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.