WGL: వరంగల్ మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి పేరు పెట్టాలని బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిషేధర్‌రెడ్డి కోరారు. తెలంగాణ నుంచి తొలిసారిగా బీజేపీ ఎంపీగా గెలిచి పార్టీ బలోపేతానికి జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టడం ఘన నివాళి అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'వరంగల్ విమానాశ్రయానికి జంగారెడ్డి పేరు పెట్టాలి'


