KMM: పాండురంగాపురం–సారపాక మధ్య సుమారు 16 కి.మీ రైల్వే పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పనుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి మార్గాలపై కూడా తుమ్మల విజ్ఞప్తులు చేశారు.
తెలంగాణ
పాండురంగాపురం–సారపాక రైల్వేకు కదలిక


