హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధురాలి తలపై సుత్తితో దాడి!

PPM: గరుగుబిల్లి మండలంలోని కోట్నాన రామినాయుడువలసలో ఒంటరిగా ఉన్న కోడి గౌరమ్మ అనే వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు దాడి చేశాడు. ఆదివారం ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో సుత్తితో తలపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన గౌరమ్మను పార్వతీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.