NZB : వైశ్య సంఘం వినాయక మండపాల్లో నిర్వహించే స్నేహపూర్వక సమ్మేళనమే ప్రసాద్ పార్టీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని గంజ్‌లో పట్టణ వైశ్య సంఘంలో 'ప్రసాద్ పార్టీ' నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు నడపడంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు.
తెలంగాణ
'గణేష్ మండపాలను సందర్శించిన MLA'


