హైదరాబాద్: 28°C
తెలంగాణ

'2 లక్షల గరికతో వినాయకుడికి విశేష అలంకరణ'

NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండపంలో కొలువుదీరిన గణనాథుడిని ఆదివారం రెండు లక్షల గరికలతో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా అలంకరించారు. గరికలతో అలంకరించిన గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మండపానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.