అన్నమయ్య: కె.వి.పల్లి మండలం సొరకాయలపేట, గోరంట్లపల్లి పంచాయతీల రైతులకు సోమవారం ఉదయం 11 గంటలకు రైతుసేవా కేంద్రంలో ఉలవలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి మాధవి తెలిపారు. రైతులు ఆధార్, 1-బీ లేదా భూమి పాసు పుస్తకం, ఆధార్కు అనుసంధానమైన ఫోన్ తీసుకురావాలని సూచించారు. భూమి ఎవరి పేరుపై ఉంటే ఆ రైతే స్వయంగా వచ్చి ఉలవలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉలవల కోసం రైతులు ఆధారాలతో రావాలి'


