కృష్ణా: గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న మచిలీపట్నం ప్రజలకు ఆదివారం కురిసిన తొలకరి జల్లులు ఉపశమనం కలిగించాయి.ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.వేడి,ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు చిరుజల్లులతో కాస్త ఉపశమనం పొందారు. వర్షం కారణంగా వాతావరణంలో ఆహ్లాదకరమైన మార్పు చోటుచేసుకుందని ప్రజలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తొలకరి జల్లులతో చల్లబడిన వాతావరణం


