ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 239.300 మీటర్లకు చేరగా, 2.805 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో రాత్రి 9 గంటలకు 6 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, నదులు దాటవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణ
వట్టివాగు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు


