ADB: గణపతి నిమజ్జన ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పరిశీలించారు. ఇందులో భాగంగా వినాయక చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు తిరుగుతూ రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా తగు భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ


