హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమాన పైలట్‌గా తండావాసి

SDPT: హుస్నాబాద్‌ మండలంలోని బల్లు నాయక్‌ తండాకు చెందిన లావుడియా మనోజ్‌ నాయక్‌ విమాన పైలట్‌గా ఎంపికై తండాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు ఆదివారం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ గిరిజన కుటుంబం నుంచి కష్టపడి పైలట్‌గా ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకమని గుగులోతు తిరుపతి నాయక్‌ అన్నారు.