హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కురుమ సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లేష్'

BHNG: కొలనుపాక గ్రామ కురుమ సంఘం ఉపాధ్యక్షుడిగా వగ్గు మల్లేష్ కురుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీరప్ప దేవాలయ అభివృద్ధి, కురుమ సంఘం భవన నిర్మాణం, కురుమ మఠం అభివృద్ధికి సోదరుల సహకారంతో కృషి చేస్తానని మల్లేష్ తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అండదండలతో మఠం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సంఘం అధ్యక్షుడు పరిదే సతీష్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగిందని నిర్వహకులు తెలిపారు.