హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా విద్యార్థులకు స్కాలర్‌షిప్..!

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ యూనివర్సిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ECSS స్కాలర్‌షిప్‌లు లభించాయి. బి. అరుణ్ కుమార్, కె. హర్షిత, పప్పులేటి పవిత్ర, ముషారఫా నాజ్ షేక్‌లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.3 లక్షలు అందాయి. విద్యార్థులను మిట్స్ యాజమాన్యం అభినందించింది.