ADB: బేల మండలంలోని అవల్ పూర్ గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సోడెం లత పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతురాలికి భర్త సురేష్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ విషాద ఘటనతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలంగాణ
పిడుగుపాటుతో వివాహిత మృతి


