హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NLR: వరికుంటపాడు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఓమిని వ్యాను, బొలెరో ట్రాలీ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడకక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.