హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ హయాంలోని పట్టాలే పంచుతున్నారు: కేకే రాజు

VSP: పట్టాల పంపిణీ పేరుతో కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారం చేస్తోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఆదివారం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు జీవోల ద్వారా ఉచితంగా, రాయితీలతో హక్కులు కల్పించారని తెలిపారు. అప్పట్లో సిద్ధమైన పట్టాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుందన్నారు.