హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అమెరికన్

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికాకు చెందిన నోరా మాట్లండ్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.