హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాల్లో కాటసాని ప్రత్యేక పూజలు

KRNL: కల్లూరు అర్బన్‌లోని 34, 35వ వార్డుల్లో వినాయక మండపాలను వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.