హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. కమిషన్ సమీక్షకు జిల్లా అధికారులు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు రేపు ప్రజావాణి కోసం కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.