హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

GNTR: వినాయక చవితి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను కలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.