హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనా కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మాత్రం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.