హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుని సేవలో ఎలిమినేటి నరసింహ రెడ్డి

RR: గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా GHMC 53, 56 డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. స్థానిక నాయకులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.