హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MRPS నేతలు

BHPL: మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన ఎంఎంఎస్ మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు జిల్లెల్ల కొండమ్మ అకాల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్–ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.