హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగు పాటుతో రైతులకు తీవ్ర గాయాలు

NZB: పోలం పనులు చేస్తుండగా రైతులపై పిడుగు పడిన ఘటన కామరెడ్డి జిల్లా గాంధారి మండలం బొప్పాడజీవాడ శివారులో చోటు చేసుకుంది. ఇద్దరు రైతులు పత్తి పంటకు గుంటుక కొడుతున్న సమయంలో వారి పిడుగు పడింది. దీంతో వారి ఫోన్ ఒక్కసారిగా పేలిపోయాయి. తీవ్ర గాయలపాలైన వారు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన స్థానిక రైతులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.