హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ

SDPT: బెజ్జంకి మండలం వడ్లూర్‌ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కుంకుమ పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పలువురు మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్గొన్నారు. గణనాథుడిని కొలుస్తూ కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.