హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటిగుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

MLG: తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన ములుగు మండలం ఖాసిందేపేటలో ఆదివారం చోటుచేసుకుంది. సీపీఐ నాయకుడు మహమ్మద్ అంజద్ పాషా కుమార్తెలు సమ్యాన్ (19), ఆసియా (10) పొలంలో సమీపంలోని ఫామ్‌పాండ్‌ వద్దకు వెళ్లి నీటిలో మునిగారు. గమనించిన కుటుంబ సభ్యులు బయటకు తీసేలోపే ఇద్దరూ మృతి చెందారు.