హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటు.. గొర్రెలు మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లిలో ఆదివారం పిడుగుపాటుకు గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన చిలువేరి మహేష్‌కు చెందిన గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.