హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో భూ పోరాటం షురూ..!

NTR: విజయవాడలో పేదల ఇళ్ల స్థలాల కోసం సీపీఎం భూ పోరాటాన్ని ప్రారంభించింది. అజిత్ సింగ్ నగర్‌లోని డిస్నీల్యాండ్, ఇతర ప్రభుత్వ భూములతో కలిపి 100 ఎకరాలకు పైగా స్థలాలను పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు డిస్నీల్యాండ్ భూముల్లోకి ప్రవేశించి జెండాలు పాతారు.