హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

SRCL: బోయినిపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గసికంటి శేషాంక్ ఖోఖోలో ప్రతిభ చాటాడు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గసికంటి శంకర్, అరుణ అతడిని అభినందించారు.