నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్‌లో ఆదివారం పిడుగుపాటు కలకలం రేపింది. పిడుగు పడటంతో రెండు మేకలు మృతి చెందాయి. సమీపంలో ఉన్న ఇద్దరు గొర్రెల కాపరులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
తెలంగాణ
పిడుగుపాటుతో ఇద్దరి మేకలు కాపరులకు గాయాలు


